CM Revanth Reddy : ప్రజా పాలన విజయోత్సవం సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హై సిటీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు రూ. 3667 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన , ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 3500 కోట్లతో ఫ్లై ఓవర్లు, రహదారుల పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు, అలాగే పలు జంక్షన్లలో రూ. 1.50 కోట్ల బ్యూటిఫికేషన్ పనులకు ప్రారంభోత్సవం జరగనుంది. అంతేకాక, రూ. 16.50 కోట్లతో నిర్మిస్తున్న రైన్ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్‌లో పూర్తి చేసిన వాటిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం కేబీఆర్ పార్క్ చుట్టూ ఆరు ఫ్లైఓవర్లు, అండర్ పాసులు నిర్మించే పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం హై సిటీ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది, వాటిలోని మరిన్ని పనులు ఇవాళ ఐమాక్స్ పక్కన హెచ్ఎండీఏ గ్రౌండ్లో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
Student Suicide : నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ప్రజాపాలన విజయోత్సవం భాగంగా, వరద నీటి సంపుల నిర్మాణం కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సచివాలయం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం హైదరాబాద్ వ్యాప్తంగా 12 ప్రాంతాల్లో జరుగుతుంది. ఒక్కో సంపు సామర్థ్యం 1 లక్ష నుండి 10 లక్షల లీటర్ల వరకు ఉంటుంది, , వరద నీటిని రోడ్ల మీద నుంచి సంపులోకి పంపించి కాలువల ద్వారా మళ్లించడమే టార్గెట్. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో పారిశుధ్య కార్మికులకు హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నారు. అన్ని రకాల స్క్రీనింగ్ టెస్టులు చేయనున్నారు. వీటితో పాటు కార్మికులకు పీపీఈ కిట్లను అందజేయనున్నారు. 2కే రన్ సైతం నిర్వహించనున్నారు.
ఇదిలాఉంటే…. వర్షాల సమయంలో రోడ్డుపై చేరే వరదను సమర్థవంతంగా మళ్లించగలిగితే, వరదల వల్ల ఏర్పడే ట్రాఫిక్ జామ్‌లను తగ్గించవచ్చని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథిగృహం వద్ద వరద నివారణ కోసం నిర్మించనున్న వాన నీటి సంపుల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వాన నీటి సంపుల డిజైన్‌లను మార్చాలని సీఎం అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లోని 141 వరదప్రమాద స్థలాల వద్ద వాన నీటి సంపులు నిర్మించాలని, వచ్చే వానాకాలం నాటికి అన్నీ పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వరద నివారణ చర్యల విషయంలో అధికారులు తీసుకోవాల్సిన తదుపరి కార్యక్రమాలపై కూడా సీఎం పలు సూచనలు చేశారు.
Narendra Modi : ప్రతి భారతీయుడికి సత్వర న్యాయం జరిగేలా మా ప్రయత్నాల్లో ప్రత్యేక రోజు