తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ (Delhi ) వెళ్లనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో ఆయన వెంటనే హస్తినకు బయల్దేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేతలు మహేశ్ గౌడ్ తదితరులు ఈ భేటీలో పాల్గొననున్నారని సమాచారం. ఈ సమావేశం రాష్ట్ర రాజకీయ పరిణామాల దృష్ట్యా కీలకంగా మారింది.
AC : ఏసీ కొనుగోలు చేయబోతున్నారా..? ఇలా తీసుకుంటే మీకు కరెంట్ బిల్లు ఆదా !
సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఇతర నేతలు కేంద్ర కాంగ్రెస్ అధినాయకత్వం సూచనల మేరకు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion), కొన్ని కీలక పదవుల భర్తీ వంటి అంశాలపై నేతలు కేంద్రంలో ఉన్న కేసీ వేణుగోపాల్, ఇతర కాంగ్రెస్ బిగ్ లీడర్లతో సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు రాష్ట్రపతి ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణ వంటి విషయాలు కూడా చర్చలో ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
Spirtual: ఏంటి మనం చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లే మనం ఎదుర్కొనే సమస్యల కారణమా?
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి కొన్ని నెలలు గడుస్తున్నా, మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతుండడం పై అనేక ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ సమావేశం ద్వారా మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబడుతుందా? ఎవరెవరు కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కించుకుంటారు? అనే అంశాలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.