Site icon HashtagU Telugu

CM Revanth Reddy : హరీష్‌ రాజీనామా రెడీ చేసుకో.. నీ సవాల్‌కు సిద్ధం..

Donkey Egg

తెలంగాణలో లోక్‌ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. రుణమాఫీ కేంద్రంలో అధికార కాంగ్రెస్‌ను పార్టీని టార్గెట్ చేస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్‌ నేత, ఎమ్మెల్యే హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్‌ ఏ రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించిన హరీష్‌ రావు మాట్లాడుతూ.. రూ.2 లక్షల పంట రుణమాఫీని ముఖ్యమంత్రి అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఇకపై పోటీ చేయనని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీలను ఒక్కటి కూడా నేరవేర్చలేదని ఆయన ఆరోపించారు. ఆగస్టు 15లోగా పంట రుణాల మాఫీ, ఆరు హామీలను అమలు చేయడంలో విఫలమైతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్‌ రావు మీడియాలో కౌంటర్ విసిరారు.

అంతేకాకుండా.. శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద దీనిపై సీఎంతో చర్చకు నేను సిద్ధంగా ఉన్నానన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి చర్చకు హాజరవుతారని ఆశిస్తున్నానని హరీష్‌ రావు అన్నారు. సీఎం చెప్పిన వాగ్దానాలన్నింటినీ అమలు చేస్తే రాజీనామా చేస్తానని, లేదంటే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా అని హరీష్‌ రావు అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే.. ఇవాళ వరంగల్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్న సీఎం రేవంత్‌ రెడ్డి.. మాజీ మంత్రి హరీష్‌ రావు చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా.. రైతు రుణమాఫీ చేస్తే హరీష్‌ రావు రాజీనామా చేస్తామంటున్నారని, ఆగస్టు 15లోపు రూ.2లక్షలు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్‌ రెడ్డి ఉద్ఘాటించారు. హరీశ్ రావు.. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. కేసీఆర్ మాదిరి మాట తప్పవద్దు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం రావాలి. అక్కడే నిపుణులతో చర్చిద్దాం అని హరీష్‌ రావుకు సీఎం రేవంత్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు.

అయితే.. ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత కరెంట్‌ లాంటి పథకాలను అమలు చేస్తోంది. అంతేకాకుండా.. అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఇంత తక్కువ సమయంలో ఇన్ని పథకాలు అమల్లోకి తీసుకువచ్చినా బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, అధికారం పోయిందనే ఫ్రస్టేషన్‌లోనే బీఆర్‌ఎస్‌ నేతలు అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారని తెలంగాణ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read Also Yadadri Thermal Power Plant : అతి త్వరలో యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి