Site icon HashtagU Telugu

VoterAdhikarYatra : రాహుల్ చేపట్టిన ‘ఓట్ అధికార్ యాత్ర’లో పాల్గొన్న సీఎం రేవంత్

Cm Revanth Reddy Joined The

Cm Revanth Reddy Joined The

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth), ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఇతర కేబినెట్ మంత్రులు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓట్ అధికార్ యాత్ర’ (VoterAdhikarYatra )లో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి బీహార్‌లోని దర్భంగ సమీపంలో రాహుల్ గాంధీ యాత్రలో వీరంతా పాల్గొనడం జరిగింది. ఈ పర్యటన ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ నాయకత్వానికి, అలాగే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు తమ సంపూర్ణ మద్దతును తెలియజేసారు.

ఈ సందర్బంగా రేవంత్ రెడ్డు సోషల్ మీడియా లో ట్వీట్ చేసారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా దేశంలో ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు వేసింది. కులం, మతం, వర్గం, లింగం అనే తేడా లేకుండా ప్రతి పౌరుడికి సమానమైన ఓటు హక్కును కల్పించి, ప్రతి ఒక్కరినీ శక్తివంతం చేసింది. ఈ హక్కు మన ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభం.

Amit Shah : నక్సలిజం కొనసాగడానికి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి తీర్పే కారణం

ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మరో చారిత్రక పోరాటాన్ని ప్రారంభించింది. శ్రీ రాహుల్ గాంధీ నాయకత్వంలో, ఓటు హక్కును రక్షించడానికి, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడానికి పోరాటం చేస్తోంది. బీహార్‌లో శ్రీ రాహుల్ గాంధీ ప్రారంభించిన ‘#ఓటర్ అధికార్ యాత్ర’లో ఒక అంకితభావం కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, బలోపేతం చేయడానికి శ్రీ రాహుల్ గాంధీ చేపట్టిన ప్రతి ఆలోచన, చర్య మరియు ఉద్యమానికి నేను మద్దతుగా ఉంటాను. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ ఈ యాత్రను చేపట్టింది. ఈ యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది అంటూ పోస్ట్ చేసారు.

ఇక ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రజలను కలుపుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంటి యువ నాయకుడు ఈ యాత్రలో పాల్గొనడం వల్ల, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరడమే కాకుండా, దేశవ్యాప్తంగా పార్టీకి ఒక కొత్త ఊపు వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పర్యటన జాతీయ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి పాత్రను మరింత కీలకం చేయగలదని భావిస్తున్నారు.