Dasoju Sravan: కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు సీఎం రేవంత్ కు లేదు: దాసోజు

  • Written By:
  • Updated On - April 3, 2024 / 09:36 AM IST

Dasoju Sravan: ‘‘రేవంత్ రెడ్డి తెలంగాణకు శాపంలా మారిండు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న పిచ్చోడు రేవంత్. దమ్ముంటే ఆరు గ్యారెంటీలని అమలు చేయాలి. రేవంత్ కు చేతకాకపోతే దిగిపోవాలి’’ అంటూ మరోసారి బిఆర్ఎస్ సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘‘కాలికి గాయమైనప్పటికీ తోటి రైతులకు అండగా వుండాలని సింహాలా బయటికి వచ్చారు కేసీఆర్. ఇది చూసి రేవంత్ రెడ్డి లాగులు తడిచాయి. అందుకే గాయత్రి పంపు నుంచి నిన్న నీళ్లు ఇచ్చిండు. నాగార్జున సాగర్ డ్యాం ప్రాజెక్ట్ మళ్ళీ కాలువాలోకి వదిలే ప్రయత్నం చేసిండు. తెలంగాణ నీళ్ళు అన్ని గోదారి మీదగా ఆంధ్ర ప్రాంతంలోకి ప్రవహించే దుశ్చర్యకు పాల్పడుతున్న రేవంత్ తెలంగాణకు శాపంగా మారిండు. ప్రతి రైతుకు రైతు బంధు, రైతు భీమా ఇలా అన్ని రకాలుగా ఆదుకొని వ్యవసాయాన్ని పండగ చేశారు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి కుట్ర పాలనలో రైతులు పంటలని తగలబెట్టుకుంటున్నారు. ట్యాంకర్లలో నీళ్ళు ఎందుకు తీసుకెలుతున్నారు ? దీనికి సమాధానం చెప్పకుండా పిచ్చోడిలా చిల్లరగా మాట్లడుతుండు రేవంత్ రెడ్డి’’ శ్రవణ్ విమర్శించారు.

‘‘ఆరు గ్యారెంటీల అమలుపై రేవంత్ రెడ్డి డ్రామా కంపెనీలు చిల్లర డ్రామాలు ఆడుతున్నాయి. పింఛన్లు ఇవ్వని రేవంత్ రెడ్డికి కేసీఆర్ ని విమర్శించే నైతిక హక్కు ఉందా? కేవలం తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికే పిచ్చి వాడుగు వాగుతుండు రేవంత్ రెడ్డి. తెలంగాణలో కరెంట్ ఎందుకు పోతుంది? పొలాల దగ్గర రైతులు ఎందుకు పడుకుంటున్నారు? కేసీఆర్ పాలనలో లేని కరెంట్ సమస్య తన పాలన ఎందుకు వస్తోంది ? ఇది రేవంత్ అసమర్ధత కాదా? గత ఎన్నికలో సందర్భంలో రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలక్షన్ కమీషన్ నుకు పిర్యాదు చేసి రైతు బంధు అమలు కాకుండా చేశారు. కానీ మేము వారిలా అడ్డుకోము. మీకు దమ్ముంటే ఈ ఎన్నికల సమయంలోనే ఆరు గ్యారెంటీలలో వున్న పదమూడు హామీలు అమలు చేయాలి’’ దాసోజు శ్రవణ్ సీఎం రేవంత్ నుద్దేశించి ఘాటుగా విమర్శించారు.