Site icon HashtagU Telugu

Congress Jana Jathara : ముదిరాజ్‌లకు కీలక హామీ ఇచ్చిన సీఎం రేవంత్

Cng Narayanapet

Cng Narayanapet

లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ..ముదిరాజ్‌ (Mudiraj)లకు కీలక హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయడంఖా మోగించిన కాంగ్రెస్ పార్టీ..లోక్ సభ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ చేయాలనీ చూస్తుంది. ఇందులో భాగంగా జనజాతర పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తూ..ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నారాయణ పేట జిల్లాలో జనజాతర పేరిట బహిరంగ సభ నిర్వహించింది కాంగ్రెస్. ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.. ముదిరాజ్‌లకు కీలక హామీ ఇచ్చారు. ముదిరాజ్‌లను బీసీ-డీ నుండి బీసీ-ఏ గ్రూప్‌లోకి మార్చేందుకు పోరాడుతామని ప్రకటించారు. ముదిరాజ్ లను బీసీ-ఏలోకి మార్చాలనే కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంటే పదేళ్లు పాటు సీఎంగా ఉన్న కేసీఆర్ ఏనాడూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని 14 ఎంపీ సీట్లలో గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర జనాభాలో 10 శాతం ఉన్న ముదిరాజ్‌లకు కేసీఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని ఈ సందర్బంగా రేవంత్ గుర్తు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ప్రకారం ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని అది కూడా ఒకేసాచేసి తీరుతామని స్పష్టం చేశారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు వేసేదే లేదన్నారు. ఇదే సందర్బంగా కేసీఆర్ ఫై విమర్శల వర్షం కురిపించారు. ప్రజల కోసం ఏనాడూ కేసీఆర్ పట్టించుకోలేదు కనుకనే.. వంద అడుగుల గోతిలో బీఆర్ఎస్ ను పాతిపెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పక్కనుంచే కృష్ణా నది పారుతున్నా సరే బీఆర్ఎస్ పట్టించుకోకపోవడంతో.. చుక్క నీరు లేకుండా పోయిందన్నారు. అందుకే రూ.4వేల కోట్లతో మక్తల్, నారాయణపేట్ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి… లక్షా 30 వేల ఎరకాలకు నీళ్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ ను కేటాయించిందని.. కానీ బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేసి దాన్ని ఆపించిందని అన్నారు. అయినాగానీ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వికారాబాద్-కృష్ణా రైల్వే జోన్ తీసుకువస్తామన్నారు.

అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత ఫై కూడా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. కవిత బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. ‘జైలులో ఉన్న బిడ్డను కాపాడుకునేందుకు కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, BRSను మోడీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని అన్నారు. BRS ఓట్లన్నీ బీజేపీకి మళ్లించాలని కేసీఆర్ చెప్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో BRS నేతలు ప్రచారమే చేయట్లేదు’ అని వ్యాఖ్యానించారు.

Read Also : Janasena : సీఎం జగన్ ఫై దాడిని పుష్ప మేకింగ్ తో షేర్ చేసిన జనసేన

Exit mobile version