తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..కుమారి ఆంటీకి(Kumari Aunty) గుడ్ న్యూస్ తెలిపారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందని చెప్పి..కుమారి ఆంటీ షాప్ ను ట్రాఫిక్ పోలీసులు మంగళవారం క్లోజ్ చేయించడం సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. హైదరాబాద్ నగరంలో ఎక్కడ ట్రాఫిక్ సమస్య లేదా..? ఇక్కడే ట్రాఫిక్ సమస్య ఏర్పడిందా అని చెప్పి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ దీనిపై స్పందించారు. ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సూచించారు. ప్రజాపాలన అంటే చిరు వ్యాపారులకు ప్రభుత్వమే అండగా ఉండడమే అని రేవంత్ పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
హైదరాబాద్ లోని దుర్గం చెరువు సమీపంలోని ఫుట్ స్ట్రీట్ (Street Food) లో కుమారి ఆంటీ మధ్యాహ్నం పూట వెజ్, నాన్ వెజ్ మీల్స్ విక్రయిస్తూ ఉంటుంది. ఈమె ఇటీవల ఒక వీడియోతో నెట్టింట బాగా ఫేమస్ అయ్యింది. నాన్న మీది రూ.థౌజెండ్ అయ్యింది.. 2 లివర్లు ఎక్స్ ట్రా అంటూ చెప్పిన వీడియో పెద్దఎత్తున చర్చలకు దారి తీసింది. సినీ స్టార్స్ సైతం ఈమె ఫుడ్ తినేందుకు పోటీ పడడంతో ఇంకేముందు యూట్యూబర్లంతా ఈమె దగ్గరికి వాలిపోయారు..మెను కార్డు నుండి ప్రతిదీ కవర్ చేస్తూ వైరల్ చేసారు. ఈ వీడియోస్ చుసినా జనాలంతా ఈమె దగ్గరికి వాలిపోయారు. ఈమె దగ్గర ఫుడ్ తినానాలంటే కనీసం గంటకు పైగా వెయిట్ చేయాల్సదే..అంటే అర్ధం చేసుకోవాలి..ఈమె దగ్గరికి ఎంతమంది వస్తున్నారో..ఈమె దగ్గర జనాలు చూసి స్టార్ హోటల్స్ సైతం ఆశ్చర్యపోవడం మొదలుపెట్టారు. ఫలితంగా.. రద్దీ ఎక్కువైపోయి, రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీంతో.. ఆ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ జాం అవుతోంది. ఇది కాస్త ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారడంతో మంగళవారం ఈమె షాప్ ను క్లోజ్ చేయించారు ట్రాఫిక్ పోలీసులు. ఈ తరుణంలో కుమారి ఆంటీ మీడియా ముందుకు వచ్చిన తన బాధను వ్యక్తం చేశారు.
Read Also : Saindhav: ఓటీటీలోకి వచ్చేస్తున్న సైంధవ్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే