Site icon HashtagU Telugu

CM Revanth & CBN : సీఎం చంద్రబాబు తో సమావేశం ఫిక్స్ చేసిన సీఎం రేవంత్..

Cbn Revant Bheti

Cbn Revant Bheti

తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కాబోతున్నారు. ఈ మేరకు డేట్ అండ్ సమయం ఫిక్స్ అయ్యింది. ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబు (AP CM CHandrababu)..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) కి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విభజన అంశాలను పరిష్కరించుకుందామని , ఇందుకు ఈ నెల 6న హైదరాబాద్‌లో సమావేశమవుదామని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా చాలా సమస్యలు అలాగే ఉన్నాయని… ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముఖాముఖి సమావేశాలతోనే ఇవి పరిష్కారమవుతాయని , ఇచ్చిన విభజన హామీల పరిష్కారం కోసం కలిసి చర్చించుకోవడమే మంచిదని, పరస్పర సహకారం… తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందని, పునర్విభజన చట్టం ప్రకారం ఎన్నో సమస్యలు పరిష్కారం కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమవుతోందని బాబు పేర్కొన్నారు. ఈ లేఖ ఫై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..మంగళవారం సాయంత్రం సమావేశం సమయం , తేదీని ఫిక్స్ చేసారు. విభజన చట్టంలో ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు ప్రతిపాదించిన సమావేశానికి తాను అంగీకరిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ ప్రభుత్వం తరపున చంద్రబాబును తాము సాదరంగా ఆహ్వానిస్తున్నామని , జూలై 6న హైదరాబాద్‌లోని మహాత్మాజ్యోతిరావు ఫూలే భవన్‌లో సమావేశం ఏర్పాటు చేసుకొందామని తెలిపారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి అధికారికంగా తన అంగీకారాన్ని ఓ లేఖ ద్వారా చంద్రబాబుకు పంపారు. ఎక్స్‌లో ఓ పోస్టు కూడా చేశారు. ‘‘ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన మీరు ఎంతో ప్రత్యేకత చాటుకున్నారు. ఈ టర్మ్‌లో మీరు మరింత మంచి పాలన అందించాలని కోరుకుంటున్నాను. జరగబోయే ముఖాముఖి సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా నేను మీ అభిప్రాయాలను గౌరవిస్తాను. విభజన చట్టంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ అంశాలు పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. ఇది జరగడం కోసం నేరుగా కూర్చొని మాట్లాడుకుంటనే మంచిది. పరస్ఫరం ఆలోచనలు పంచుకోవడం, సమస్యల పరిష్కారం కోసం ఉత్తమమైన మార్గాలను అన్వేషించాలి’’ అని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Read Also : KTR : కేటీఆర్ సవాళ్లకు విలువ ఉందా..?