CM Revanth Reddy : మార్చురీలో ఉన్నారని అన్నది కేసీఆర్‌ను కాదు..క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్

CM Revanth Reddy : బీఆర్‌ఎస్ (BRS) పార్టీపై విరుచుకుపడిన ఆయన, పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని

Published By: HashtagU Telugu Desk
Cm Revanth Reddy Kcr Mortua

Cm Revanth Reddy Kcr Mortua

తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth ) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ (BRS) పార్టీపై విరుచుకుపడిన ఆయన, పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని , పదేళ్లు ప్రభుత్వంలో ఉండి ప్రతిపక్షానికి వెళ్లింది. ఆ తర్వాత 8 ఎంపీ సీట్లు కోల్పోయి గుండుసున్నాకు పడిపోయి మార్చురీ(Mortuary)కి వెళ్లిపోయింది” అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

214 Hostages Killed: 214 మంది బందీలను చంపాం.. ‘రైలు హైజాక్‌’పై బీఎల్ఏ ప్రకటన

బీఆర్‌ఎస్ నేతలు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆయన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌(KCR)ను లక్ష్యంగా చేసి ఈ వ్యాఖ్యలు చేసారని, కేసీఆర్‌ను “మార్చురీకి పంపిస్తారు” అంటూ మాట్లాడారని, ఇది రేవంత్ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. ముఖ్యంగా గంగుల కమలాకర్, ఇతర బీఆర్‌ఎస్ నేతలు, కేసీఆర్‌ను తండ్రి సమానులుగా భావిస్తున్నామని, ఆయన చావును ఎవరూ కోరుకోరని, తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టతనిచ్చారు.

Pawan Powerful Punch : జగన్ ‘కార్పొరేటర్’ కామెంట్స్‌కు పవన్ మాములు పంచ్ ఇవ్వలేదు

రేవంత్ రెడ్డి తన వివరణలో తాను చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితిని ఉద్దేశించే చేసినవి, కానీ హరీష్ రావు, కేటీఆర్ తమ స్వప్రయోజనాల కోసం వాటిని కేసీఆర్‌పై అనుకున్నట్లు చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. తాను వ్యక్తిగతంగా ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదని, ఆ మాటలు తను చెప్పనివి కాదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను వివాదాస్పదంగా మార్చి ప్రజల్లో అపోహలు కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులను విమర్శించారు. మరి రేవంత్ క్లారిటీ తో ఈ వివాదం సర్దుమణుగుతుందా..? లేదా ఇలాగే కొనసాగుతుందా..? అనేది చూడాలి.

  Last Updated: 15 Mar 2025, 02:05 PM IST