Site icon HashtagU Telugu

Fali S. Nariman: నారిమన్ మృతికి సీఎం రేవంత్ సంతాపం

Eminent Jurist Fali Nariman Passes Away

Eminent Jurist Fali Nariman Passes Away

Fali S. Nariman: ప్రముఖ న్యాయనిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్.నారిమన్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు .నారీమన్ రాజ్యాంగబద్ధ న్యాయవాది అని ముఖ్యమంత్రి అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. నారిమన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. అత్యుత్తమ న్యాయవాదులలో నారిమన్ ఒకరని మోదీ పేర్కొన్నారు. సామాన్య పౌరుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారన్నారు

నారిమన్ సుదీర్ఘ కెరీర్ లో దేశ చరిత్ర గతిని మలుపుతిప్పే పలు కేసుల్లో తన వాదనా వినిపించారు. న్యాయ కోవిదుడిగా పేరు తెచ్చుకున్నారు. న్యాయవాద రంగంలో మహోన్నత వ్యక్తి నారిమన్ భారతీయ న్యాయ శాస్త్రానికి గణనీయమైన కృషి చేశారు. మే 1972లో భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. జనవరి 1991లో అతనికి పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్‌తో సహా పలు అవార్డులతో గుర్తింపు పొందారు.

Also Read; Medaram Bus Accident : మేడారం జాతర ప్రారంభం..వరుసగా ఆర్టీసీ బస్సుల ప్రమాదం