Delhi Floods: ఓపిక పట్టండి: ఢిల్లీ ప్రజలకు సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి

ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా అక్కడ రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ఇప్పటికే అక్కడ పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు

Delhi Floods: ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా అక్కడ రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ఇప్పటికే అక్కడ పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. అన్ని విద్యా సంస్థలను ఆదివారం (జూలై 16, 2023) వరకు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా యమునా నది నీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా ఈరోజు జూలై 13, 2023న ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA)తో నిర్వహించిన సమావేశం తర్వాత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు.

యమునా నదిలో నీటిమట్టం పెరిగిన తర్వాత తలెత్తిన పరిస్థితులపై ఇవాళ డీడీఎంఏ సమావేశం నిర్వహించామని సీఎం తెలిపారు. ఢిల్లీలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు ఆదివారం వరకు మూసివేసినట్టు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు ఇంటి నుంచే విధులు నిర్వర్తించాలని సీఎం ఆదేశించారు. ఇక అక్కడ నీటి సరఫరా కష్టంగా మారింది. అయితే రేషన్ మాదిరిగా నీటిని సరఫరా చేస్తామని సీఎం పేర్కొన్నారు. సిటీలోకి అత్యవసర సేవలతో కూడిన పెద్ద వాహనాలను మాత్రమే అనుమతించనున్నారు. ఢిల్లీ వాసులందరూ ఓపిక పట్టండి, త్వరలో నీటి మట్టం తగ్గుతుంది మరియు పరిస్థితి సాధారణం అవుతుందని సీఎం ఢిల్లీ ప్రజానీకాన్ని కోరారు.

Read More: BRS Tickets: బీఆర్ఎస్ లో టికెట్ల ఇష్యూ, ఆ 25 నియోజకవర్గాలో బిగ్ ఫైట్!