Site icon HashtagU Telugu

CM KCR: కుటుంబ సమేతంగా.. నేడు కొల్హాపూర్‌కు సీఎం కేసీఆర్..!

Kcr Kolhapur

Kcr Kolhapur

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు వెళ్లనున్నారు. ఈ క్ర‌మంలో కుటుంబ సమేతంగా కొల్హాపూర్‌కు వెళ్లనున్న కేసీఆర్, దేశంలోని శక్తి పీఠాలలో ఒకటైన మహలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని, అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు. దర్శనం అనంతరం తిరిగి సాయంత్రం హైదరాబాద్ తిరుగుపయనం కానున్నారు.

లక్ష్మీదేవికి ప్రత్యేకించి ఉన్న ఆలయాల్లో కొల్హాపూర్ కోవెల ముఖ్యమైంది. అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవదిగా చెప్పుకునే ఈ ఆలయాన్ని ప్రతియేటా లక్షలాది భక్తులు దర్శించుకుని ఆమె దీవెనలను కోరుకుంటారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే దేశంలోని పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. ఈ క్ర‌మంలో ఈరోజు మరో శక్తిపీఠాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోనున్నారు.