Site icon HashtagU Telugu

CM KCR: కైకాలకు సీఎం కేసీఆర్ నివాళి

Kcr tribute

Kcr

సినీ నటుడు కైకాల సత్యనారాయణ పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించి, పుష్పాంజలి ఘటించారు. కైకాల సత్యనారాయణ కుమారులను, కూతుళ్లను, కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో నటుడిగా, ఎంపీగా కైకాలతో తనకున్న అనుబంధాన్ని సీఎం స్మరించుకున్నారు. ‘‘సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గారు గొప్ప వ్యక్తి. ఈరోజు వారు మరణించడం చాలా బాధాకరం” అని అయన అన్నారు.

సినీ హీరోలతో పోటీపడుతూ చాలా అద్భుతంగా నటించే వారాయన. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో నటించి, అద్భుతమైన పేరు తెచ్చుకున్న వ్యక్తి. నేను కొంతకాలం వారితో కలిసి పనిచేయడం జరిగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కైకాల గారిని కోల్పోవడం బాధాకరమని కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు, ఎమ్మెల్యేలున్నారు.

Exit mobile version