Site icon HashtagU Telugu

CM KCR : నేడు రంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌

Cm Kcr

Cm Kcr

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు రండారెడ్డి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. కొంగరకలాన్‌లో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ భ‌వ‌నాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించ‌నున్నారు. సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2 గంటలకు కొంగరకలాన్‌కు చేరుకుని ముందుగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. కలెక్టరేట్‌ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను పరిశీలించారు.

Exit mobile version