Site icon HashtagU Telugu

CM KCR: రేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే

Kcr

Kcr

గత నాలుగైదు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో ధన, ప్రాణ నష్టం బాగానే జరిగింది. వేల ప్రాజెక్టులకు నీరందించే డ్యాములు సైతం డెంజర్ జోన్లో పడ్డాయి. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. నిర్మల్‌లోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు నుంచి భద్రాచలం, గోదావరి నది వరద ప్రభావిత ప్రాంతాల వరకు ఏరియల్ సర్వేను ముఖ్యమంత్రి కొనసాగించనున్నారు.

ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉంటారు. కేసీఆర్ టూర్ ఖరారు కావడంతో అధికారులు ఏరియల్ సర్వే మార్గం, ఇతర ఏర్పాట్లు చేసేందుకు నిమగ్నమవుతున్నారు. ఇదిలావుండగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంటు వ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి గోదావరి నది వరద ప్రభావిత ప్రాంతాల్లోని అన్ని ఆసుపత్రుల వైద్యులు, ఆరోగ్య సిబ్బందితో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు సమావేశం నిర్వహిస్తున్నారు.