Site icon HashtagU Telugu

KCR: సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టమెంటరీ పార్టీ సమావేశం!

CM KCR

CM KCR

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రేపు (ఆదివారం) మధ్యాహ్నం 1 గంట కు ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానున్నది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న సందర్భంగా.. లోక్ సభ, రాజ్య సభల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయనున్నట్టు సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలు,  కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ సమస్యలపై ఎంపీలకు నివేదికలు అందజేస్తారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు ఉభయ సభల్లో టీఆర్ఎస్ పార్టీ  ఎంపీలు, కేంద్రంపై అనుసరించాల్సిన పోరాట పంథా పై సీఎం కేసిఆర్ ఎంపీలకు సూచనలు ఆదేశాలు జారీ చేస్తారు.

Exit mobile version