తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ బిఆర్ఎస్ నేడు సోమవారం మొదటివిడుత అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించింది. కామారెడ్డి, గజ్వేల్ నుండి కేసీఆర్ పోటీ చేయబోతున్నారు. ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు కేసీఆర్. ఈసారి కూడా పెద్దగా మార్పులు లేకుండానే ఎన్నికలకు వెళ్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. కొన్ని స్థానాల్లో ఇష్టం లేకపోయినా అభ్యర్థులను మార్చాల్సి వచ్చిందని సీఎం తెలిపారు. వైరా, ఆసిఫాబాద్, బోథ్, ఉప్పల్ స్థానాల్లో అభ్యర్థులను మార్చినట్లు సీఎం చెప్పారు. హుజూరాబాద్ స్థానంలో కౌశిక్‌రెడ్డి, వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావులు పోటీ చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. వేములవాడలో ఎమ్మెల్యే పౌరసత్వం వివాదం నేపథ్యంలో మార్చాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. కంటోన్మెంట్ సీటు సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించినట్లు వెల్లడించారు.
పూర్తి అభ్యర్థుల లిస్ట్ :
Brs Party First List11
Brs Party First List2
Brs Party First List32
Brs Party First List 4