Telangana Elections 2023: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రచార వ్యూహాన్ని ఈ రోజు నుంచి మొదలు పెట్టింది. ఈ రోజు అక్టోబర్ 15న తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చి ఎమ్మెల్యే అభ్యర్థులతో మాట్లాడారు. ఎన్నికల తప్పొప్పులను అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాక్షేత్రంలో గెలిచినప్పటికీ సంకేతంగా తప్పులు చేయకూడదని సీఎం చెప్పారు. గతంలో ఎన్నికలకు సమర్పించిన పత్రాల్లో వనమా వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ గౌడ్ చేసిన మిస్టేక్స్ ని ఎత్తి చూపారు. అలాంటి సాంకేతిక సమస్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా చూడాలని అన్నారు.
సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..సాంకేతికంగా, ఆర్థికంగా మనల్ని విపక్షాలు దెబ్బతీయాలని చూస్తున్నాయని, ఎప్పటికప్పుడు అభ్యర్థులు, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సీఎం అన్నారు. ఏదైనా న్యాయ సలహాల కోసం న్యాయవాది, తెలంగాణ డైరీ కార్పొరేషన్ చైర్మన్ భరత్ కుమార్ సోమ నెంబర్‌కు 9848023175 నెంబర్‌కు సంప్రదించాలని అభ్యర్థులను సూచించారు. ప్రస్తుతం 51 బీఫామ్‌లు మాత్రమే అందజేయనుండగా.. మిగతావి రానున్న రెండ్రోజుల్లో అందజేస్తామని సీఎం వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని.. ప్రతీ కార్యకర్తను కలవాలని సూచించారు.
Also Read: BRS : మనమే గెలవబోతున్నాం .. తొందర పడొద్దు – సీఎం కేసీఆర్