KCR Skip PM’s Meet: మోడీకి మ‌ళ్లీ కేసీఆర్ జ‌ల‌క్ ?

ప్ర‌ధాన మంత్రి మోడీ ఆహ్వానాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రోసారి దూరంగా పెట్ట‌బోతున్నారు.

  • Written By:
  • Updated On - August 4, 2022 / 01:20 PM IST

ప్ర‌ధాన మంత్రి మోడీ ఆహ్వానాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రోసారి దూరంగా పెట్ట‌బోతున్నారు. ఆ మేర‌కు టీఆర్ఎస్ వ‌ర్గాల్లో సీరియ‌స్ చ‌ర్చ జ‌రుగుతోంది. వాస్త‌వంగా ఈనెల 6వ తేదీన రాష్ట్ర‌ప‌తిభ‌వ‌న్ లో జ‌రిగే `ఆజాదీ కా అమృత మ‌హోత్స‌వ్‌` కు హాజ‌రు కావాల‌ని కేంద్రం ఆహ్వానం పంపించింది. కానీ, ఏదో ఒక కార‌ణం చెప్ప‌డం ద్వారా ఆ ఉత్స‌వాల‌కు దూరంగా ఉండాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. రాష్ట్ర‌భ‌వ‌న్ లో జ‌రిగే ఆ కార్య‌క్ర‌మం మోడీ నేతృత్వంలో జ‌ర‌గ‌నుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలకు,కీల‌క లీడ‌ర్ల‌కు కేంద్రం ఆహ్వానం పంపింది. 75 ఏళ్ల స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని `ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌`పై జాతీయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)కి సోమవారం ప్రధాని నుంచి ఆహ్వానం అందిన‌ట్ట అధికారులు ధ్రువీక‌రించారు. అయితే, సీఎం కేసీఆర్ మాత్రం మోడీ నిర్వ‌హించే ఈ క‌మిటీ స‌మావేశానికి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఫౌంహౌస్ వ‌ర్గాల టాక్‌.

సీఎం కేసీఆర్ చివ‌రి సారిగా గతేడాది సెప్టెంబర్ 3న ఢిల్లీలో ప్ర‌ధాని మోడీని కలిశారు. గతేడాది నవంబర్‌లో హుజూరాబాద్‌ ఉపఎన్నిక తర్వాత టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య సంబంధాలు తెగిపోయాయి. మే 26న ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ 20వ వార్షిక వేడుకల్లో పాల్గొనేందుకు మోదీ హైదరాబాద్ వ‌చ్చారు. ఆ రోజున సీఎం బెంగళూరు టూర్ పెట్టుకున్నారు. జూలై 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు హైద‌రాబాద్ వచ్చిన ప్ర‌ధాని మోడీకి దూరంగా ఉన్నారు. ముచ్చింత‌ల్ స‌మ‌తామూర్తి విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ కోసం ఫిబ్రవరి 5 న వ‌చ్చిన‌ మోదీని కలవకుండా కేసీఆర్ మొఖంచాటేశారు. కోవిడ్ స‌మ‌యంలోనూ భార‌త్ బ‌యోటెక్ విజిట్‌కు వ‌చ్చిన మోడీని క‌లవ‌కుండా కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఇలా ప‌లు సంద‌ర్భాల్లో మోడీ తెలంగాణ‌కు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఏదో ఒక కార‌ణంతో దూరంగా ఉంటున్నారు. అందుకే, ఈసారి కూడా ఆయ‌న ఉత్స‌వాల‌కు వెళ్ల‌ర‌ని తెలుస్తోంది.