నందమూరి తారకరత్న మరణ వార్త ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలను కలిచివేసింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం ప్రకటించారు. తారకరత్న మరణం పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచారం వెలిబుచ్చారు. తారకరత్న కన్నుమూయడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.మంత్రి హరీశ్ రావు కూడా తారకరత్న మృతి పట్ల స్పందించారు. తారకరత్న మరణించారన్న వార్తతో తీవ్ర విచారం కలిగిందన్నారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి, స్నేహితులకు సంతాపం తెలియజేస్తున్నట్టు హరీశ్ వెల్లడించారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. తారకరత్న మృతి పట్ల ఏపీ సీఎం జగన్ సంతాపం ప్రకటించారు. విషాదంలో ఉన్న ఆయన కుటుంబసభ్యులకు సీఎం జగన్ సంతాపం తెలిపారు.
Tarakaratna : తారకరత్న మృతికి సీఎం కేసీఆర్, జగన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతాపం

Tarakaratna