Site icon HashtagU Telugu

CM KCR: టమాటా రైతుల్ని అభినందిన సీఎం కేసీఆర్

CM KCR

New Web Story Copy (30)

CM KCR: మూడు కోట్ల రూపాయల విలువైన టమాటా పంట పండించిన మెదక్ జిల్లా, కౌడిపల్లి మండలం, మహ్మద్ నగర్ కు చెందిన రైతు బాన్సువాడ మహిపాల్ రెడ్డి దంపతులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డితో వచ్చిన రైతు మహిపాల్ రెడ్డి సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రిని కలిశారు. ఇప్పటికే రెండు కోట్ల రూపాయల విలువైన టమాటా పంటను అమ్మామని, మరో కోటి రూపాయల విలువైన పంట కోతకు సిద్ధంగా ఉందని మహిపాల్ రెడ్డి సీఎంకు వివరించారు.

వాణిజ్య పంటల సాగు విషయంలో తెలంగాణ రైతులు వినూత్నంగా ఆలోచిస్తే పంటల సాగు లాభదాయకంగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.

Also Read: Bandi Sanjay : అమిత్ షాని కలిసిన బండి సంజయ్.. అధ్యక్ష పదవి తొలగిన తర్వాత మొదటిసారి.. బండికి స్పెషల్ హామీలు?