CM KCR: పుట్టినకాడినుంచి సచ్చినదాక ప్రభుత్వ స్కీములున్నది తెలంగాణలోనే!

‘‘ ఇప్పటి వరకూ కలలో కూడా ఎవరూ ఊహించని విధంగా భువనగిరి జిల్లా ఏర్పాటు చేసుకొని, అద్భుతమైన జిల్లా కలెక్టరేట్‌కు ప్రారంభించుకున్నందుకు యాదాద్రి జిల్లా ప్రజలు,

  • Written By:
  • Updated On - February 12, 2022 / 09:53 PM IST

‘‘ ఇప్పటి వరకూ కలలో కూడా ఎవరూ ఊహించని విధంగా భువనగిరి జిల్లా ఏర్పాటు చేసుకొని, అద్భుతమైన జిల్లా కలెక్టరేట్‌కు ప్రారంభించుకున్నందుకు యాదాద్రి జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కలెక్టర్‌ను అభినందిస్తున్నాను.’’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. శనివారం యాదాద్రి పర్యటనలో భాగంగా సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన అధికారుల సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడారు.
‘‘గతంలో యావత్‌ భారత్‌దేశంలో అన్ని రాష్ట్రాలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నా.. కేవలం ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ కొత్త జిల్లాలు ఏర్పాటు చేయలేదు. గతంలో కొందరు కోరినా చేయలేకపోయారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్వయంగా మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేస్తానని చెప్పారు. కారణం ఏదైనా ఆయన సైతం చేయలేకపోయారు. అనేక రకాల అపోహలు, సరైన పద్ధతిలో కుదరకపోవడంతో సాధ్యం కాలేదు. జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు సంప్రదించి మొదటి వ్యక్తి ఛత్తీస్‌గఢ్‌ చీఫ్‌ అడ్వైజర్‌. తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమం చేసిన సందర్భంలో నేను ఆయనను డజన్‌ సార్లు కలవడం జరిగింది. చాలా మందికి అపనమ్మకం, ఆత్మవిశ్వాసం లేకపోవడంతో ఏమో కొట్లాడుతున్నరు గానీ తెలంగాణ అయితదా అని చాలా మంది సంశయజీవులే పెద్ద సంఖ్యలో ఉండిరి. మాకు సంపూర్ణ నమ్మకం ఉండే.. ఈ సారి తెలంగాణ వందకు వందశాతం వస్తదని. ఛత్తీస్‌గఢ్‌ అడ్వైజర్‌ను ఛత్తీస్‌గఢ్‌ మధ్యప్రదేశ్‌ నుంచి విడిపోయిన రాష్ట్రం కదా.. ఏం చేశారని, ఏం స్టెప్స్‌ తీసుకున్నరని అడిగి తెలుసుకున్నాం. ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్‌ జిల్లా ఉండేదని, దానిపై పెద్ద జోక్స్‌ ఉండేవి. బస్తర్‌ జిల్లా కేరళ రాష్ట్రం కంటే పెద్దగా ఉంటదని జోక్స్‌ ఉండేవి.

ఇప్పుడు దాన్ని నాలుగైదు జిల్లాలు చేశారు. అందులో ప్రధాన పాత్ర వహించింది ఛత్తీస్‌గఢ్‌ అడ్వైజర్‌. వారిని అడిగాం అరౌండ్‌ పది లక్షలు, 10-12 లక్షలు ఉంటే ఈజీ, కొన్ని సందర్భాలు, ప్రత్యేక పరిస్థితుల్లో 5లక్షల పాపులేషన్‌ ఉన్నా ఆయన గోహెడ్‌ అని చెప్పారు. ఇపుడు బ్రహ్మండంగా బీబీనగర్, భువనగిరి, హైదరాబాద్, ఘట్కేసర్, ఉప్పల్ ఒక్కేటే కారిడార్ లాగా తయారైపోతది. ఇది పేరుకు జిల్లాగ ఉంటది గానీ హైదరాబాద్ లో కలిసినట్టే వాతావరణం వచ్చేస్తుంది. దీని తరువాత వెంటనే ఆలేరు, జనగామ, ఘన్ పూర్, హన్మకొండ, వరంగల్ ఆ సిరీస్ అంత ఉంది. నేను ఉహించినటువంటి, నేను కలగనేటువంటి హైదరాబాద్, వరంగల్ చాలా అద్భుతమైనటువంటి కారిడార్ అయితది. గొప్ప ఉజ్వలమైటువంటి ఈ మధ్యలో వచ్చేటువంటి గోత్ సెంటర్స్ అవుతాయి. భువనగిరి ర్యాపిడ్‌గా వేగంగా డెవలప్‌ అయ్యే ప్రాంతం. యాదాద్రి టెంపుల్‌ అభివృద్ధి అయిపోతే.. అనూహ్యంగా అభివృద్ధి చెందుతుంది. బీబీనగర్‌, భువనగిరి, ఘట్కేసర్‌, హైదరాబాద్‌ అంతా కలిసిపోయి కారిడర్‌గా ఉంటది. తాను కలగనే కారిడార్‌ వరంగల్‌ – హైదరాబాద్‌ అద్భుతమైన కారిడార్‌ అవుతుంది. వాటి మధ్యలో వచ్చేవన్నీ గ్రోత్‌ సెంటర్స్‌ అవుతాయ్‌. భువనగిరి, జనగామ, హనుమకొండ, వరంగల్‌, మేడల్చ్‌ జిల్లా కేంద్రాలు కావడం ద్వారా వచ్చేటటువంటి గ్రోత్‌.. ఇది అందరు సామాన్యులకు అర్థం కాదు.’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

‘‘ భువనగిరి, యాదాద్రిలో భూముల ధరలు ఎట్ల ఉన్నయ్‌.. ఒకప్పుడు ఎట్ల ఉండే. గుట్టపొంటి సైతం కోట్లే. మారుమూల గ్రామాలకు పోతే 25-30లక్షల్లోపు ఎకరం భూమి దొరికే పరిస్థితి లేదు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మాగనూర్‌ మండల కేంద్రంలో అక్కడ భూమి ఎవరు అడగపోతేది. అక్కడ సైతం రూ.25లక్షల ఎకరంకు తక్కువ లేదు. తెలంగాణ శివారులోని కర్ణాటకలో రూ.4లక్షలు, రూ.5లక్షలు ఉంటే.. మన ప్రాంతంలో రూ.25లక్షలకు తక్కువ లేదని ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి చెప్పిండు. మారు మూల ప్రాంతాల్లోని ఆదిలాబాద్‌ అడవి జిల్లా, అచ్చంపేట, నారాయణపేట జిల్లాలో భూముల ధరలు పెరిగాయి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘‘ఈ రోజు హైదరాబాద్ లో మన ప్రభుత్వం అధికారులు ఛీఫ్ సెక్రటరీ గారి నాయకత్వంలో మంత్రివర్గంతోపాటు, మీరు కూడా అద్భుతమైన కృషి చేసినారు. దాన్ని ఎవరు అవునన్న కాదన్న నేను ప్రత్యక్ష సాక్షిని కాబట్టి, టార్గెట్లు సాధించిందే నేను కాబట్టి, నేను మీ అధికారులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న, ఈరోజు భూగర్భ జలాలు పెరిగినాయి. ఒకనాడు తెలంగాణలో 800 నుండి 900 ఫీట్లకు బోర్లు వేసినా భువనగిరిలో, ఆలేరు, తుర్కపల్లి, రాజపేటలో నీళ్లు రాకుండె. ఇయాల 20 ఫీట్లకే 30, 10 ఫీట్లకే నీళ్ళు వస్తున్నయంటే. ఎంత అంకిత భావంగా ఎన్ని శాఖల కృషి ఉన్నది. వ్యవసాయ భూములను 2600 క్లస్టర్ల కింద విభజించి ప్రతి క్లస్టర్ కు ఒక అధికారిని పెట్టి ప్రతి క్లస్టర్ కు ఒక రైతు వేదిక కట్టి, మొత్తం మిషన్ కాకతీయ కింద చెరువులన్నీ పూడికలు తీసినం. చెరువులన్నీ నిండుతున్నయి. మల్ల వాగులలో చెక్ డ్యామ్ లను కట్టి అద్భుతంగా చేసినం. ఇప్పుడు ప్రతి వాగు మీద చెక్ డ్యామ్ లు కట్టుకున్నాము. నేను దాటుతుంటే ఆలేరు వాగు కాడ బ్రహ్మండంగా చెక్ డ్యామ్ కనబడుతుంది. జనగామ మీద యశ్వంతపూర్ కాడ చెక్ డ్యామ్ కనపబడుతుంది. నీళ్లు దాటుకుంటా పోయిన. బ్రిడ్జి కిందనే కట్టినారు యశ్వంతపూర్ లో మీరు కూడా రోజు పోతరు జనగాంకు ఈ విధంగా ఈ కృషి అర్థం చేసుకొని ప్లాన్ చేసుకొని దానిని పకడ్బందీగా చేస్తే 24 గంటల కరెంటు ఉంటది. అది కరెంటు డిపార్ట్ మెంట్ పడ్డ శ్రమ. బ్రహ్మండంగా మిషన్ కాయతీయ ద్వారా చెరువులన్నీ నిండుతున్నాయి, కాలం బాగా అయితే. ఒక్కో సంవత్సరం చెరువులు నిండితే, మత్తల్లు దుంకితే, 10 వేల చెరువులు, 9 వేల చెరువులు పటాకులు తెగినట్టు చెర్లు తెగుడు ఎందుకంటే స్టోరేజ్ కేపాసిటీ లేదు వరద గట్టిగా వస్తే తెగిపోతాయి. మీ అందరికీ గుర్తు ఉండే ఉంటది. నల్లగొండ జిల్లాల చెరువు తెగిపోతే వలిగొండ కాడ రైలు కొట్టుకపోయింది. అందుకే మిషన్ కాకతీయతో చెరువులను బాగు చేసుకున్నం. కాకతీయుల గొలుసుకట్టు చెరువులే కాబట్టి వాళ్లే పేర్లే పడితేనే బరుకతి ఉంటదని మిషన్ కాయతీయ అని పేరు పట్టినం. ఇది కూడా మీరు నమ్మరు. చాలామంది ఆశ్చర్యం అనిపిస్తది. మేము ఎంతో బలంగా నమ్మేటోళ్లం. తెలంగాణ వస్తది అంటే ఢిల్లీలో ప్రొఫెసర్ జయశంకర్, ఇదే జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ నిపుణులు విద్యాసాగర్ రావు కలిసి చర్చించుకునేది. మన గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ గ్రామీన బతుకు రైతాంగం బతుకు చెల్లచెదురు అయింది కాబట్టి అక్కడి నుంచి మొదలు పెట్టాలే పునర్మిర్మాణం అని ఆలోచన చేసినం. ఆ రోజు పెట్టిన పేరు మిషన్ కాకతీయ. తెలంగాణలో జరిగిన పకడ్బందీ పనికి, నేను నిజంగా చీఫ్ సెక్రటరీ గారికి తెలంగాణ రైతుల పట్ల నేను హృదయ పూర్వకమైన థ్యాంక్స్ చెపుతున్న. సభలో పాల్గొన్నవాళ్ళలో ఉద్యోగులు కూడా చాల మంది ఉన్నరు.

నేను చెప్పిన తప్పకుండా తెలంగాణ రాష్ట్రం వస్తది, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కేంద్ర ప్రభుత్వం కంటే ఉన్నతమైన శాలరీ ఇస్తం అని చెప్పినం ఈ రోజు ఇచ్చుకున్నం .. పుట్టినకాడినుంచి సచ్చినదాక ప్రభుత్వ స్కీము ఉన్నది తెలంగాణలో. దాన్ని మీరు అద్భుతంగా అమలు చేస్తావున్నరు, ఇక్కడ అద్భుతమైన రైతుబంధు కావొచ్చు, రైతుబీమా కావొచ్చు, ఇది మనందరికీ తెలుసు ఒక రక్షణ, ఒక ధీమా ఉన్నది’’ అని ముఖ్యమంత్రి అన్నారు. ‘‘ఇవాల హైదరాబాద్ లో ఉన్నోళ్ళంతా వాపస్ వచ్చి ఊర్లలో ఇండ్లు చదురుకుంటా ఉన్నరు, మంచి మంచి బంగ్లాలు కడుతున్నరు , ఎందుకు కడుతా ఉన్నరు, బ్రహ్మాండమైన ఆర్థిక పుష్టి , ఇవాల మూడు ఎకరాల ఉన్న రైతు కోటిశ్వరుడు అండి తెలంగాణ లో. ఒకప్పుడు ఈ రాజపేట మండలం గంధమల్ల దిక్కు పోతే యాబై వేలకు డెబ్బై వేలకు ఎకరం భూమి దొరికేది , ఇయాల ఇరవై లక్షలు అని మాట్లాడితే కూడా మల్ల కూడా మాట్లాడేవు జాగ్రత్త అని కోపానికి వస్తావున్నడు రైతు, అంటే ఆ పరిస్థితి వచ్చేసింది, అటువంటి ఒక గొప్ప ధనిక రాష్ట్రంగా తెలంగాణ తయారైంది. ఈరోజు మనం దళిత బంధు కార్యక్రమం పెట్టుకున్నం, సాహసం కావాలి కదా, ఇంతకుముందు దళితులకు దరిచేరనటువంటి అవకాశాలు, ఒక ఆత్మగౌరవాన్ని, ఒక విశ్వాసాన్ని పాదుకొలిపేటటువంటి అవకాశాలు, ఇయాల పర్టిలైజర్ షాప్ లో రిజర్వేషన్ ఉంటది తెలంగాణలో, మెడికల్ షాప్ లో ఉంటది రిజర్వేషన్, లేదు ఇంతముందు రిజర్వేషన్ దళిత బిడ్డలకు, మెడికల్ షాప్ ఓనర్ లేరు, ఫర్టిలైజర్ షాప్ కి ఓనర్ లేడు, ఇంకాలేరు, బార్ షాప్ ఓనర్ గా లేరు, కాంట్రాక్టర్ గా లేరు, హాస్టల్ కు, హాస్పిటల్ కు సప్లై చేసేటువంటి కాంట్రక్టర్లు లేరు, ఇంకా అనేక రంగాలలో లేరు, వాటి అన్నీట్లలలో రిజర్వేషన్ పెట్టింది ఇయాల తెలంగాణ ప్రభుత్వం, అది దళిత బంధులో ఉన్న గొప్పతనం. దళితుల కోసం రెసిడెన్షయల్ స్కూల్లు పెట్టినం , ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు ఖర్చు పెడుతం ఒక్కో విద్యార్థి మీద , అద్భుతంగా చదువుకుంటా ఉన్నరు, ఇవాలే పేపర్ లో చూసిన. చాలా బ్రహ్మాండంగా పిల్లలు ఐఐటీ లో , ఐఏఎస్ లో దీంట్లో మెడికల్ కాలేజీలలో , నీట్ లో సీట్లు కొడుతున్నరు. గతంలో విదేశీ విద్యా అవకాశం ఎవనికో ఒకనికి ఇంత ఎక్కువ ఉండే.. ఇయాల చాలా లిబరల్ గా అది జ్యోతీరావ్ పూలే మీద కావొచ్చు, డా. అంబేడ్కర్ పేరు మీద కావొచ్చు, మరోపేరు మీద కావొచ్చుపేద వర్గాల విద్యార్థులు, విదేశాలలో సీటు వచ్చింది చదువుకుంటందుకు అంటే ఇరవూ లక్షలు ఇచ్చి వెన్నుదట్టి పంపే ఒకే ఒక్క ప్రభుత్వం దేశంలో తెలంగాణ ప్రభుత్వమే’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.