Site icon HashtagU Telugu

CM KCR : రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం

Cm Kcr On Krishnam Raju Imresizer

Cm Kcr On Krishnam Raju Imresizer

ప్ర‌ముఖ సినీ న‌టుడు, కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజు మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణంరాజు మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్ర మంత్రిగా, లోక్‌సభ సభ్యునిగా కృష్ణంరాజు సేవలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. రేపు హైద‌రాబాద్‌లో ఆయ‌న అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించే అవ‌కాశం ఉంది.