Site icon HashtagU Telugu

TS Holidays: కరోనా నేపథ్యంలో సెలవులు ప్రకటించిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్రం అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 8 తేదీ నుంచి 16 తేదీ వరకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసిఆర్ ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ఈ సెలవులు ప్రకటించినట్లు తెలుస్తోంది.

మొదట 11వ తేదీ నుండి సంక్రాంతి సెలవులు ఇద్దామనుకున్నారు. అయితే 8వ తేదీ సెకండ్ శనివారం, 9వ తేదీ ఆదివారం. 10వ తేదీ కూడా హాలిడే ఇస్తే సెలవులు కలిసొస్తాయని ప్రభుత్వం భావించి ఉంటుందని సమాచారం.

కరోనా వల్ల మొన్నటిదాకా సెలవులున్న విద్యాసంస్థలకు ఇప్పుడిప్పుడే ఆఫ్ లైన్ విధానంలో క్లాసులు మొదలయ్యాయి. ఈ సమయంలో విద్యార్థులకు మళ్ళీ 9 రోజులు సెలవులు ప్రకటించడంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చేలా ఉంది. అయితే సెలవుల వల్ల కరోనా కొంతవరకు కట్టడి అయ్యే ఛాన్స్ ఉంది.

సెలవుల్లో పిల్లలకు వాక్సిన్ వేయించాలని, స్వీయ రక్షణలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. బయటికెళ్తే తప్పకుండా మాస్కు ధరించాలని, ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ, శానిటైజేషన్ చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

Exit mobile version