Site icon HashtagU Telugu

CM KCR : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి…!!

Kcr

Kcr

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో అగ్నిపథ్ కు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక ఘటనపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే పోలీసుల కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ మరణించడం బాధాకరమన్నారు సీఎం కేసీఆర్. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

రాకేశ్ కుటుంబానికి రూ. 25లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. అలాగే కుటుంబంలో అర్హులైన వారికి వారి అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలనకు బీసీ బిడ్డ రాకేశ్ బలయ్యాడని వాపోయారు. తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.