Site icon HashtagU Telugu

Nikhat Zareen : బాక్సర్ నిఖ‌త్ జ‌రీన్‌ను అభినందించిన ప్ర‌ధాని మోడీ, సీఎం కేసీఆర్‌

Nikhat Zareen

Nikhat Zareen

న్యూఢిల్లీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 50 కిలోల విభాగం ఫైనల్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న బాక్సర్ నిఖత్ జరీన్‌ను ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందించారు. వియత్నాం బాక్సర్ నుయెన్‌పై 5-0 తేడాతో విజయం సాధించి బంగారు పతకాన్ని గెలుచుకున్న జరీన్ తెలంగాణకు గర్వకారణమని కేసీఆర్ అన్నారు. జరీన్ తన వరుస విజయాలతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఉన్న ఆదరణను మరోసారి చాటిచెప్పిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమె కెరీర్‌లో రెండో బంగారు పతకం సాధించడం గొప్ప తరుణమని అన్నాడు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఈ దిశగా నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 50 కేజీల లైట్ ఫ్లైవెయిట్ విభాగంలో స్వర్ణం గెలుచుకున్నందుకు జరీన్‌ను అభినందిస్తూ ప్ర‌ధాని మోడీ ట్వీట్ చేశారు.