Site icon HashtagU Telugu

PM Modi Birthday : ప్రధాని మోడీకి బ‌ర్త్‌డే విషెష్ చెప్పిన సీఎం కేసీఆర్‌, మాజీ సీఎం చంద్ర‌బాబు

Modi option

Chandrababu naidu modi

ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్‌, ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగతంగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ ప్రజల తరపున కూడా కేసీఆర్ మోదీకి బర్త్ డే విషెస్ చెప్పారు. మోదీకి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించినట్లు సీఎం వెల్లడించారు. దేశానికి ఇంకా చాలా ఏళ్లు సేవ చేసేలా ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. ఇటు ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్రధాని మోడీకి శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రజల సంక్షేమం, దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం అవిశ్రాంతంగా పాటుపడేలా దేవుడు ఆయనకు మరిన్ని సంవత్సరాలు మంచి ఆరోగ్యం, శక్తిని ప్రసాదించాలంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Exit mobile version