ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ గుడ్ న్యూస్ చెబుతూ హెచ్ఆర్ఎ పెంచినా ఉద్యోగుల్లో కొందరు సమ్మెకే మొగ్గుచూపుతున్నారు. అయితే మరికొందరు మాత్రం జగన్ ఇచ్చిన బంపరాఫర్ కు అనుకూలంగా ఉన్నారు.
ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న ఉద్యోగ సంఘాలను చల్లబరిచే ప్రయత్నం చేశారు సీఎం జగన్. ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ అదిరే శుభవార్త అందించారు. పీఆర్సీ వల్ల హెచ్ ఆర్ఏ తగ్గిందని భావించే ఉద్యోగులకు ఉద్యోగుల హౌస్ రెంట్ అలవెన్స్ ని రెట్టింపు చేసేసింది. విజయవాడ పరిసరాల్లో ఉన్న హెచ్ఓడీ కార్యాలయాల్లోని ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పీఆర్సీ జోవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఆందోళన ఉద్ధృతం చేసిన తరుణంలో.. ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం .ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏను 8 శాతం నుంచి 16 శాతంకు పెంచుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పెంపు హైదరాబాద్ నుంచి విజయవాడ పరిసరాలకు గతంలో వచ్చిన హెచ్ఓడీ ఉద్యోగులకు వర్తించనుందని జీవోలో పేర్కొన్నారు. మరి, ఇంకా ఉద్యోగులు సమ్మె బాట పడితే ఎస్మా ప్రయోగం తప్పదని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఇప్పటికే ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేసింది.
AP PRC: ఉద్యోగులకు బంపరాఫర్

Jagan AP employees