Site icon HashtagU Telugu

CM Jagan : నేడు క‌ర్నూల్‌, నంద్యాల‌లో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న

Cm Jagan

Cm Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా దోనె, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లోని 77 చెరువులకు నీరు నింపే పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు.కృష్ణగిరి మండలం ఆలంకొండకు చేరుకుని హంద్రీనీవా నీటిని చెరువులకు ఎత్తిపోసే పంప్‌హౌస్‌ మోటార్లను ఆన్ చేయనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం నంద్యాల జిల్లాలో సీఎం జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు (మంగ‌ళ‌వారం) తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. మహాద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు ఆల‌య సంప్ర‌దాయంతో అర్చ‌కులు స్వాగతం పలికి వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో ఆలయంలోకి తీసుకెళ్లారు.పూజానంతరం రంగనాయకుల మండపంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వేదాశీర్వచనం స్వీకరించారు. సీఎం జ‌గ‌న్‌కు టీటీడీ చైర్మన్ కరుణాకరరెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు