Site icon HashtagU Telugu

CM Jagan:రేపు ఢిల్లీ కి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ .. ప్ర‌ధాని మోడీతో కీల‌క భేటి..!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కూడా లభించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు, అమరావతి అంశం సహా కీలక అంశాలపై ప్రధాని మోదీతో జగన్ చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ అంచనాలు, నీటి వివాదాలు, ఇతర రాజకీయ అంశాలపై వైఎస్ జగన్ ప్రధానితో చర్చలు జరిపే అవకాశం ఉంది. రుణ పరిమితిని సడలించాలని కోరుతూ మంత్రులు, అధికారులు కేంద్రం ముందు ఫిర్యాదులు చేశారు. అయినా అనుమతి లభించలేదు. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన కీలకంగా మారింది