CM Jagan : రైతుల ఖాతాల్లోకి రైతు భ‌రోసా నిధులు.. ప‌త్తికొండ‌లో బ‌ట‌న్ నొక్క‌నున్న సీఎం జ‌గ‌న్‌

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు (గురువారం) కర్నూలు జిల్లా పత్తికొండలో ప‌ర్య‌టించ‌నున్నారు. వరుసగా ఐదవ సంవత్సరం

  • Written By:
  • Publish Date - June 1, 2023 / 07:08 AM IST

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు (గురువారం) కర్నూలు జిల్లా పత్తికొండలో ప‌ర్య‌టించ‌నున్నారు. వరుసగా ఐదవ సంవత్సరం మొదటి దశ వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ యోజన మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు. ఈ ఏడాది మొదటి విడతగా 52,30,939 మంది రైతులకు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ కింద ఒక్కో రైతుకు రూ.5,500, పీఎం కిసాన్ యోజన కింద మరో రూ.2,000 కూడా నిధులు విడుదలైన వెంటనే రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఖరీఫ్ నాట్లు వేసే సమయంలో రైతుల ఖాతాల్లోకి డ‌బ్బులు జ‌మ చేస్తుంది. రైతు భరోసా కింద ప్రస్తుతం పంపిణీ చేస్తున్న రూ.3,923 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లలో రైతులకు రూ.30,985 కోట్లు పంపిణీ చేసింది.