Atchannaidu: వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీ ఓ డ్రామా గ్యాలరీ!

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ ప్లీనరీనుద్దేశించి ఆసక్తికర వాఖ్యలు చేశారు.

  • Written By:
  • Publish Date - July 8, 2022 / 06:21 PM IST

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ ప్లీనరీనుద్దేశించి ఆసక్తికర వాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతున్న రెండు రోజుల వైఎస్సార్‌సీపీ ప్లీనరీకి అనుకూలంగా జగన్ మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీకి బస్సులు అద్దెకు ఇవ్వడంతో ఏపీఎస్‌ఆర్టీసీకి రూ.10 కోట్ల నష్టం వాటిల్లిందని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ వ్యవధిలోనే మూడుసార్లు ఆర్టీసీ బస్సు చార్జీలను సీఎం పెంచారని విమర్శించారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీని డ్రామా గ్యాలరీగా అభివర్ణించిన అచ్చెన్నాయుడుటీడీపీ మహానాడుకు ప్రైవేట్ వాహనాలు అద్దెకు ఇవ్వకుండా వైసీపీ గవర్నమెంట్ యజమానులను బెదిరిస్తోందని మండిపడ్డారు.

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (ఏఎన్‌యూ)కి సెలవులు ప్రకటించడంతోపాటు పలు ప్రాంతాల నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ప్లీనరీకి తీసుకెళ్లేందుకు ప్రైవేటు పాఠశాలల బస్సులను బలవంతంగా వినియోగించడాన్ని టీడీపీ అధినేత ఏపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ప్లీనరీ సమీపంలో జాతీయ రహదారికి ఇరువైపులా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని అచ్చెన్నాయుడు తీవ్రంగా పట్టారు.