AP : శుక్రవారమే చంద్రబాబు ను అరెస్ట్ చేయాలనుకోవడం వెనుక జగన్ భారీ మాస్టర్ ప్లాన్

శని, ఆదివారాలు కోర్టుకు సెలవు. కేసులో మోపిన అభియోగాల తీవ్రత దృష్ట్యా మేజిస్ట్రేట్‌ ఇంటి వద్ద చంద్రబాబును హాజరు పరిచినా అప్పటికప్పుడు

  • Written By:
  • Updated On - September 9, 2023 / 04:34 AM IST

టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు( Chandrababu Naidu) ను అరెస్ట్ చేయబోతున్నారనే వార్త ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 73 ఏళ్ల వయసు..పవర్ ఫుల్ సీఎం గా..ప్రభుత్వాన్ని చెమటలు పట్టించిన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కు రికార్డు ఉంది. అలాంటి నేతను పట్టుకొని జగన్ సర్కార్ అరెస్ట్ చేసేందుకు సిద్ధం అయ్యిందనేది యావత్ ప్రజలు ఖండిస్తున్నారు.

అసలు చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పడం లేదు..పదినిమిషాలకో మాట చెపుతూ వస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం నంద్యాల RK ఫంక్షన్ హల్ (Nandyal RK function Hall) వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. శుక్రవారమే చంద్రబాబు ను అరెస్ట్ చేయడం వెనుక జగన్ పెద్ద వ్యూహమే రచించాడని అర్ధమవుతుంది. ఎందుకంటే శని, ఆదివారాలు కోర్టుకు సెలవు. కేసులో మోపిన అభియోగాల తీవ్రత దృష్ట్యా మేజిస్ట్రేట్‌ ఇంటి వద్ద చంద్రబాబును హాజరు పరిచినా అప్పటికప్పుడు ఎంత వరకు రిలీఫ్‌ లభిస్తుందనేది సందేహమే. మేజిస్ట్రేట్‌ నుంచి చంద్రబాబుకు ఊరట లభించకుంటే శని, ఆదివారాలు జైలులో ఉంచాలన్నది జగన్‌ సర్కారు ఉద్దేశమని స్పష్టంగా అర్ధం అవుతుంది.

మరోపక్క చంద్రబాబు అరెస్ట్ ను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. 3 గంటల సమయంలో రావాల్సిన అవసరం ఏంటి అని నేతలు ప్రశ్నిస్తున్నారు. మా అధినేత ఎక్కడికి పారిపోయే వ్యక్తి కాదని , ఉదయం వచ్చి ఆయనతో మాట్లాడండి..ఈ సమయంలో ఇంత పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో రావాల్సిన అవసరం ఏంటి అని వారంతా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం RK ఫంక్షన్ హల్ వద్ద ఉన్న మీడియా ను బయటకు పంపిస్తున్నారు. లోపల కవర్ చేయకుండా బయటకు పంపడం ఫై మీడియా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : AP : శుక్రవారమే చంద్రబాబు ను అరెస్ట్ చేయాలనుకోవడం వెనుక జగన్ భారీ మాస్టర్ ప్లాన్

టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు( Chandrababu Naidu) సీఎం గా ఉన్న సమయంలో ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల రూపంలో రూ.118 కోట్ల ముడుపులు అందుకున్నారని ఐటీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నోటీసుల నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేస్తారని గత నాల్గు రోజులుగా వార్తలు ప్రచారం అవుతూ వచ్చాయి. రెండు రోజుల క్రితం కూడా చంద్రబాబు తనను అరెస్ట్ చేస్తారని చెప్పడం తో టీడీపీ శ్రేణులు మరింత ఆందోళనకు గురయ్యారు. అంత అనుకున్నట్లే నంద్యాలలో ఉన్న చంద్రబాబు ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు చేరుకున్నారు.