CM Jagan: నంద్యాల జిల్లా పరిధిలో అవుకు, పాణ్యం, బేతంచెర్ల, డోన్ మండలాల్లో ఏర్పాటు చేసే సోలార్, విండ్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. బేతంచెర్ల మండలం ముద్దవరం, డోన్ మండల కేంద్రంలో ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో 1000 మెగా వాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు, 1000 మెగా వాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులు మంజూరయ్యాయి.
ఈ ప్రాజెక్ట్‌లకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 8 వేల ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయన్నారు.
Also Read: BRS Party: ఎర్రబెల్లి ఆకర్ష్, బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు