Site icon HashtagU Telugu

Kidambi Srikanth:భార‌త ష‌ట్ల‌ర్ కిదాంబి శ్రీకాంత్ కు ఏపీ సీఎం జ‌గ‌న్ భారీ న‌జ‌రాన‌.. !

Whatsapp Image 2021 12 29 At 20.18.54 Imresizer

Whatsapp Image 2021 12 29 At 20.18.54 Imresizer

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఘనంగా సత్కరించారు. రూ.7 లక్షల నగదుతో పాటు బ్యాడ్మింటన్ అకాడమీని నెలకొల్పేందుకు శ్రీకాంత్‌కు తిరుపతిలో ఐదెకరాల భూమిని కేటాయించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ డిసెంబర్ 12 నుండి 19 వరకు స్పెయిన్‌లో జరిగిన BWF వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ 2021లో రజత పతక విజేతగా నిలిచాడు.

ముఖ్యమంత్రిని కలవడం పట్ల ష‌ట్ల‌ర్ శ్రీకాంత్ సంతోషం వ్యక్తం చేశారు. తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదెకరాల భూమిని మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన కిదాంబి.. ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ అకాడమీని ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయి క్రీడాకారులకు శిక్షణ ఇస్తానని చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధతో క్రీడాకారులు సంతోషంగా ఉన్నారని, వారి తరపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు శ్రీకాంత్‌ తెలిపారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్‌, సాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్దార్థరెడ్డి, సాప్‌ ఎండీ ఎన్‌ ప్రభాకర్‌రెడ్డి, సాప్‌ ఓఎస్‌డీ రామకృష్ణ, శ్రీకాంత్‌ తల్లిదండ్రులు రాధాముకుంద, కేవీఎస్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.