Site icon HashtagU Telugu

AP CM: ఆ ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టి

Whatsapp Image 2021 12 14 At 20.54.23 Imresizer

cm jagan meeting

రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌లో మిగతా జిల్లాలతో పోలిస్తే కాస్త దిగువన ఉన్న ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. తూర్పుగోదావరి, గుంటూరు, వైయస్సార్‌కడప, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రెండో డోస్‌పైన ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. 15 నుంచి 18 ఏళ్లవారికీ 100శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తిచేసిన నెల్లూరు, ప.గో. జిల్లాలు కాగా, మరో 5 జిల్లాల్లో 90శాతానికిపైగా ఈ వయసులవారికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది. మరో నాలుగు జిల్లాల్లో 80శాతానికిపైగా వ్యాక్సినేషన్‌ కంప్లీట్ అయ్యింది. ఈ నేపథ్యంలో మిగిలిన జిల్లాల్లోనూ ఉద్ధృతంగా వ్యాక్సినేషన్‌ చేయాలని సీఎం ఆదేశించారు.

Exit mobile version