Site icon HashtagU Telugu

CM Jagan: సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్‌ దంపతులు

Jagan MOhan Reddy

Jagan MOhan Reddy

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. తన క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గోశాల వద్ద శుక్రవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలను ఆయన సతీమణి భారతితో కలిసి ప్రారంభించారు.

తెలుగుదనం ఉట్టిపడేలా అచ్చ తెలుగు పంచెకట్టుతో ఆయన గోశాల ప్రాంగణంలోకి అడుగు పెట్టారు. మేళ తాళాల మధ్య వేద పండితులు పూర్ణ కుంభంతో ముఖ్యమంత్రి దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు.

సీఎం దంపతులు గోపూజ నిర్వహించి, గో సేవ చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు వారిని ఆశీర్వదించారు. దాదాపు గంటన్నర సేపు సీఎం దంపతులు వేడుకలను తిలకించారు.