Site icon HashtagU Telugu

Sheikh Rasheed: షేక్ రసీద్ కు జగన్ అభినందన.. ప్రోత్సాహం అందజేత

Rasheed

Rasheed

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను భారత క్రికెట్‌ అండర్‌ 19 జట్టు వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌ కలిశారు. షేక్‌ రషీద్‌ను అభినందించిన సీఎం జగన్, ప్రభుత్వం తరపున పలు ప్రోత్సాహకాలు కింద రూ. 10 లక్షల నగదు బహుమతి, గుంటూరులో నివాస స్ధలం కేటాయింపు, ప్రభుత్వం తరపున పూర్తి సహాయసహకారాలు అందిస్తామని హమీ ఇచ్చారు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ తరపున ప్రకటించిన రూ. 10 లక్షల చెక్‌ సీఎం చేతుల మీదుగా అందించారు. షేక్‌ రషీద్‌ స్వస్ధలం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తూ క్రికెట్‌ లవర్స్ ను ఆకట్టుకుంటున్న 17 ఏళ్ళ రషీద్‌ టీమిండియా యువ జట్టు ఆసియా కప్‌ గెలవడంలోనూ, అండర్‌ 19 ప్రపంచకప్‌ను ఐదోసారి గెలవడంలోనూ కీలకపాత్ర వహించాడు.