CM Chandrababu : 8 నెలల కూటమి పాలనపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రేపటికి మన ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతోంది. గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనను ప్రజలు అంగీకరించలేదు. మనపై విశ్వాసం పెట్టుకుని భారీ మద్దతు ఇచ్చారని అన్నారు.

Published By: HashtagU Telugu Desk
CM Chandrababu's key comments on the 8-month coalition rule

CM Chandrababu's key comments on the 8-month coalition rule

CM Chandrababu :  ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రేపటికి మన ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతోంది. గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనను ప్రజలు అంగీకరించలేదు. మనపై విశ్వాసం పెట్టుకుని భారీ మద్దతు ఇచ్చారని అన్నారు. సంపద సృష్టించి పేదలకు పంచాలని సీఎం చంద్రబాబు అన్నారు. సమర్థ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు.

Read Also: Mamata Banerjee : ఒంటరిగానే పోటీ..కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదు: దీదీ

ఆరు నెలల పాలనలో 12.94 శాతం వృద్ధి రేటు కనపడింది. ఫైళ్ల పరిశీలనలో వేగం పెంచాలి. వచ్చిన సమస్యలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి. సమస్యలను పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ఇదేదో కొంతమందిని ఎత్తిచూపడం కాదు.. వ్యవస్థ మెరుగుపడాలి. గత ఐదేళ్ల విధ్వంసంతో చాలా వెనుకబడిపోయాం. నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకెళ్తున్నాం. స్వర్ణాంధ్ర-2047 ద్వారా లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. 15 శాతం వృద్ధిరేటుతో మన ఆర్థిక వ్యవస్థ సుస్థిరం కావాలి. అప్పులు కూడా తీర్చాల్సిన అవసరముంది.

వనరులవే అధికారులూ వాళ్లే.. కానీ వృద్ధిలో వ్యత్యాసం రావాలంటే కార్యదక్షత కావాలి అని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాల్‌ ఉండేది. ఒకట్రెండు కాదు.. ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి. ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశాం. నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే ప్రజలు అధికారమిచ్చారు. పాలనా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాం. స్వర్ణాంధ్ర-2047 ద్వారా లక్ష్యాలను నిర్దేశించుకున్నాం..అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉద్యాన రంగంతో పాటు వ్యవసాయంలోనూ విలువ జోడిస్తే ఎక్కువ సంపద ఆర్జించేందుకు ఆస్కారం ఉంటుందని… ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పైనా దృష్టి పెట్టాల్సి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు.

Read Also: Gutha Sukender Reddy : సామాజిక, ఆర్థిక సర్వేపై గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

 

  Last Updated: 11 Feb 2025, 12:43 PM IST