Site icon HashtagU Telugu

Karnataka Election Results 2023: కర్ణాటకలో బీజేపీదే విజయం

Karnataka Election Results 2023

Whatsapp Image 2023 05 13 At 8.56.51 Am

Karnataka Election Results 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ పోరులో ఎవరికి వారు తమదే విజయంగా చెప్పుకుంటున్నారు. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కర్ణాటక అడ్డా కాంగ్రెస్ దే అని తేల్చేసింది. కానీ ఆ ఎగ్జిట్ పోల్స్ ని బీజేపీ లైట్ తీసుకుంది. కర్ణాటకలో బీజేపీ జెండా ఎగురవేస్తుందని ప్రచారం చేసుకుంటుంది. కాగా ఈ రోజు కర్ణాటక ఓట్ల లెక్కింపు ప్రక్రియ షురూ అయింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు తమదే విజయంగా జోస్యం చెప్పుకుంటున్నారు. అందులో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తమదే విజయమని అన్నారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హనుమాన్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. అదే సమయంలో, కాంగ్రెస్ నాయకుడు మరియు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య కాంగ్రెస్ విజయాన్ని ప్రకటించారు. పూర్తి మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రజలపై మాకు పూర్తి నమ్మకం ఉందని, మా పార్టీ విజయంపై నమ్మకంగా ఉన్నామని, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని సర్వేలు కూడా చెప్పాయన్నారు. కర్ణాటక శాసనసభలోని మొత్తం 224 స్థానాలకు మే 10న ఓటింగ్ జరగడం గమనార్హం. ఈరోజు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం ఖరారు కానుంది.

Read More: GOOGLE BLUE TICK :ఇక గూగుల్ బ్లూ టిక్.. ఎందుకంటే ?