Site icon HashtagU Telugu

Bhatti Vikramarka : పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌లో అస్వ‌స్థత‌కు గురైన సీఎల్పీ నేత భ‌ట్టి

Bhatti Vikramarka

Bhatti Vikramarka

సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క అస్వ‌స్థ‌త‌కు గురైయ్యారు. పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌లో ఆయ‌న వ‌డ‌దెబ్బ‌కు గురైయ్యారు. దీంతో రెండు రోజుల నుంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సూర్యాపేటకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద వైద్యలు చికిత్స అందిస్తున్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో తీవ్ర అస్వస్థతకు గురైన మల్లు భట్టివిక్రమార్కని సీనియర్ కాంగ్రెస్ నేతలు కేఎల్‌ఆర్, ప్రేమ్ సాగర్ రావు పరామర్శించారు. వడదెబ్బ కారణంగా జ్వరంతో పాటు ఆయ‌న నీర‌సంగా ఉన్నార‌ని వైద్యులు తెలిపారు. డిహైడ్రేషన్ కావడంతో భ‌ట్టి విక్ర‌మార్క‌కు సెలైన్స్ పెట్టి చికిత్స అందిస్తున్నారు.