అమర్నాథ్ లో ఉన్న కైలాసవాసుడిని దర్శించుకోవాలని వెళుతున్న మృత్యువాత పడుతున్నారు. గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్ ప్రదేశంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల అక్కడికి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. అమర్నాథ్ గుహ పరిసర ప్రాంతాలకు కూడా భారీగా వరద నీరు చేరుకుంది. ఈ సంఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే దాదాపుగా 12,000 మంది భక్తుల్లో వరదల్లో చిక్కుకుపోయారు. ఇదే గత కొద్దిరోజులుగా జమ్మూ కాశ్మీర్లోని ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తూ ఉండడంతో ఆ నీరు అమర్నాథ్ గృహ పరిసర ప్రాంతాల్లో రావడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు,రెవెన్యూ, ఎన్ డి ఆర్ ఎఫ్, భద్రతా సిబ్బంది, ఐటీబీపి పోలీస్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే ఎందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.