సమాజం ఎటుపోతుందో అర్ధం కావడం లేదు..ఓ పక్క కులాల మధ్య కొట్లాట..మరోపక్క మహిళలపై దాడులు , అత్యాచారాలు. అంతేనా దళితులపై వరుస దాడులు ఇలా ఎక్కడ చూసిన హింసే. ఇలా ప్రతి రోజు వార్తల్లో ఏదొక అంశం ఫై చర్చ నడుస్తూనే ఉంది. తాజాగా రాజస్థాన్ లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న ఓ బాలిక (Girl ) చేత..మూత్రం (Urine ) కలిపిన నీటిని తాగించిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది.
రాజస్థాన్ (Rajasthan) భిల్వారా జిల్లాలోని లుహరియా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 8 వ తరగతి విద్యార్థిని..భోజన సమయంలో బయటకు వెళ్లగా..ఓ వర్గానికి చెందిన కొంతమంది ఆకతాయి విద్యార్థులు(Classmates)..ఆ బాలిక వాటర్ బాటిల్ తీసుకొని అందులో మూత్రం పోసి అక్కడ పెట్టారు. ఆ విషయం తెలియని బాలిక వాటర్ ను తాగేసింది. తాగిన తర్వాత దుర్వాసన రావడంతో ఈ విషయాన్నీ స్కూల్ ప్రిన్సిపాల్ కు తెలియజేసింది. అలాగే తన బ్యాగ్ లో లవ్ లెటర్ ను కూడా పెట్టినట్లు పిర్యాదు చేసింది. అయితే ప్రిన్సిపాల్ ..ఎలాంటి యాక్షన్ తీసుకపోవడం తో తల్లిదండ్రులకు జరిగిన విషయాన్నీ తెలిపింది. నిందితుల ప్రాంతంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని, వారిని చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటన పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..నిందితులను శిక్షించాలని కోరుతున్నారు.
Read Also : Honda Elevate: మార్కెట్ లోకి హోండా సరికొత్త కారు.. తక్కువ ధరకే అధికమైలేజీ?