Site icon HashtagU Telugu

Fisheries University : ఏపీలో ఫిషరీస్ యూనివర్సిటీ రెడీ

Fisheries

Fisheries

వచ్చే ఏడాది నుంచి నరసాపురం కేంద్రంగా ఫిషరీస్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ప్రారంభించడానికి సిద్దం అయింది. త్వరలో భవన నిర్మాణం పూర్తి కానుంది. వచ్చే విద్యా సంవత్సరం (2022–2023) నుంచి కోర్సులను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.ఈ నేపథ్యంలో నరసాపురం మత్స్య విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారి ఒ.సుధాకర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం నరసాపురంలో పర్యటించి తాత్కాలిక అద్దె భవనాలను పరిశీలించింది. పట్టణంలోని పీచుపాలెం, పాతనవరసపురం ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న రెండు ఇంజినీరింగ్ కళాశాలలను ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు పరిశీలించారు. భవనాలను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే ప్రసాదరాజు తన నివాసంలో అధికారుల బృందంతో సమావేశమయ్యారు. సారిపల్లిలో అకడమిక్ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, బాలుర, బాలికల హాస్టల్ బ్లాకులను ముందుగా మంజూరైన రూ. 100 కోట్లు తో అన్ని అనుమతులు మంజూరైనందున వెంటనే టెండర్లు పిలవాలని అధికారులకు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రథమంగా, దేశంలోనే మూడోదిగా నిర్మిస్తున్న మత్స్య విశ్వవిద్యాలయం దేశంలోనే అగ్రగామిగా నిలవాలని జగన్ సర్కార్ భావిస్తుంది.