Nizamabad: వేడి గిన్నెలో పడిన 1వ తరగతి బాలిక మృతి

నిజామాబాద్ లో తీవ్ర విషాదం నెలకొంది. మామడలోని ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న బాలిక ప్రమాదశావత్తు వేడి గిన్నెలో పడింది. దీంతో తీవ్ర గాయాలపాలైన సదరు బాలిక మృతి చెందింది

Nizamabad: నిజామాబాద్ లో తీవ్ర విషాదం నెలకొంది. మామడలోని ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న బాలిక ప్రమాదశావత్తు వేడి గిన్నెలో పడింది. దీంతో తీవ్ర గాయాలపాలైన సదరు బాలిక మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్రంగా కలచివేసింది. ఆదివారం నిజామాబాద్ లో ప్రమాదవశాత్తు వేడి గిన్నెలో పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యమంత్రి అల్పాహార పథకంలో భాగంగా విద్యార్థులకు అందించడానికి ఏర్పాటు చేసిన వేడి గిన్నెలో బాలిక పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మామడలోని కొరటికల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని ప్రజ్ఞ(6) మూతలేని గిన్నెలోకి జారి పడటంతో 50 శాతానికి పైగా గాయాలయ్యాయి. క్యూలో నిల్చున్నప్పుడు పిల్లలు కొట్టుకోవడంతో ఆమె గిన్నెలో పడిపోయింది. పరిస్థితి విషమించడంతో ఆమెను నిర్మల్‌లోని ఆస్పత్రికి, ఆపై నిజామాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచింది. మరణించిన బాలిక ఎరువుల వ్యాపారి అశోక్‌, శిరీష దంపతుల ఏకైక కుమార్తె.

Also Read: Irrigation Projects : జల ప్రాజెక్టుల చిట్టా తీయండి.. ఇరిగేషన్ అధికారులకు సీఎం ఆర్డర్