Site icon HashtagU Telugu

CJI Ramana: సీజేఐ హోదాలో తొలిసారి సొంత ఊరికి వెళ్తున్న ఎన్వీ ర‌మ‌ణ‌

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తిగా జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత తొలిసారిగా సొంత ఊరికి వెళ్ల‌నున్నారు. ఈ నెల 24వ తేదీన కృష్ణాజిల్లా కంచిక‌చ‌ర్ల స‌మీపంలోని పొన్న‌వ‌రం గ్రామానికి ఆయ‌న రానున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టాక మొదటి సారి సొంత ఊరు పొన్నవరం గ్రామానికి వ‌స్తున్న‌ట్లు ఆయ‌న బంధువులు తెలిపారు. 25 వ తేదీన గ్రామంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన‌నున్నారు.ఈ నెల‌ 24 నుంచి 26 తేదీ వరకు సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ ఏపీలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ నెల 26న జరగనున్న ఏపీ రాష్ట్ర స్థాయి న్యాయాధికారులు రెండో సదస్సుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అదే రోజు ఏపీ హైకోర్ట్ ని సీజేఐ సందర్శించ‌నున్నారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం, బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగే సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు.