సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా భాద్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణకు గ్రామస్థులు అపూర్వ స్వాగతం పలికారు. జస్టిస్ ఎన్వీ రమణ పై పూలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటూ, ఎడ్లబండి పై ఊరేగింపు తో మేళా తాళాలతో, కోలాటం నృత్యాలతో జస్టిస్ ఎన్వీ రమణ ను గ్రామస్థులు తోడ్కొని వెళ్ళారు. ఊరేగింపు కు ముందు నిలిచిన అలంకృత మైన అశ్వాలు అందరిని కనువిందు చేశాయి. జస్టీస్ ఎన్వీ రమణ రాకతో ఊరంతా సందడి నెలకొంది. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించింది. సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా అన్నట్టుగా అక్కడి వాతావరణం కనిపిస్తోంది. నాయకులు, అధికారులు ఎన్వీ రమణకు పుష్పగుచ్ఛాలు అందించి ఘనస్వాగతం పలికారు.
CJI: సీజేఐ హోదాలో తొలిసారిగా సొంతూరికి!

Cji