CISF Man shoots: చెన్నైలో సిఐఎస్ఎఫ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. అయితే కదులుతున్న బస్సులోనే ఈ దారుణ ఘటనకు పాల్పడటం వెనుక అధికారులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నైట్ డ్యూటీ ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో ఆత్మహత్య చేసుకోవాల్సి అవసరం ఏమొచ్చింది అన్న దానిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలలోకి వెళితే..
చెన్నై సమీపంలోని కల్పక్కంలోని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్‌లో నైట్ డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా కదులుతున్న బస్సులో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) సిబ్బంది రవికిరణ్ (37) ఆత్మహత్య చేసుకున్నారు. రవికిరణ్ శనివారం రాత్రి డ్యూటీలో ఉన్నాడు. ఆదివారం ఉదయం 18 మంది CISF సిబ్బందితో కలిసి కాంట్రాక్ట్ బస్సులో తన క్వార్టర్‌కు తిరిగి వస్తుండగా అతను అకస్మాత్తుగా తన INSAS (ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్) రైఫిల్‌ను తీసి కాల్చుకున్నాడు. సహచర ఉద్యోగులు వెంటనే అతన్ని కల్పక్కంలోని అటామిక్ పవర్ స్టేషన్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే రవికిరణ్ చనిపోయినట్లు దృవీకరించారు వైద్యులు.
ఈ ఘటనపై కల్పక్కం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఐఎస్ఎఫ్, అటామిక్ పవర్ స్టేషన్ అధికారులు కూడా విచారణ జరుపుతున్నారు.
Also Read: Dinesh Karthik: ధోనీ సిక్స్ కొడితే ఆర్సీబీ గెలవటం ఏమిటి..? దినేష్ కార్తీక్ ఏం చెప్పాడంటే..!