నోయిడాలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీ, గౌతమ్ బుద్ధ్ నగర్‌లోని ఎన్‌టీపీసీ ప్లాంట్ కాంప్లెక్స్‌లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఉపేంద్ర కుమార్ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనా స్థలం నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇంట్లో గొడవల కారణంగానే ఆమె మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తదుపరి విచారణ జరుగుతోంది.
Suicide : నోయిడాలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య.. కారణం ఇదే..?

Deaths