Site icon HashtagU Telugu

Narayana: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్!

Narayana

Narayana

ఏపీ సీఐడీ పోలీసులు మాజీమంత్రి నారాయణను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. టెన్త్‌ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గత 4 రోజులుగా ఫోన్‌ స్విఛాప్‌ చేసి నారాయణ అజ్ఙాతంలో ఉన్నారు.చిత్తూరు జిల్లాలో నారాయణ స్కూల్ నుంచి టెన్త్ పేపర్లు లికవ్వడంతో ఆ సంస్థ యాజమాన్యం పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే వైస్‌ ప్రిన్సిపల్ గిరిధర్‌తోపాటు మరో ఇద్దరు అరెస్ట్ చేయగా…తాజాగా నారాయణ విద్యాసంస్థలు అధినేత నారాయణ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే కుటుంబ సభ్యులకు మాత్రం పోలీసులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్తున్నారు